ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ముందే వార్నింగ్ ఇచ్చాం ఓవైసీ

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను ఉద్దేశిస్తూ  పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యాలు చేసారు. మూడు రోజుల ముందే వార్నింగ్ ఇచ్చారు. మీర్జా రహ్మత్ బేగ్కు ఒక ఛాన్స్ ఉంది.. కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకుంటే మంచిది. లేదంటే పార్టీలో నుంచి బహిష్కరిస్తాం.. ఆ తర్వాత నన్ను ఇలా తొలగించారు అంటే కుదరదని అయన అన్నారు.
2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.. పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడ్డారంటూ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు.

అత్తాపూర్‌లో కొందరు యువకులు ఆయనను పట్టుకుని కొట్టి, వీడియోలు తీశారన్నారు.

ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపించారు.

వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.
====================